కామారెడ్డి, డిసెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జుక్కల్ నియోజక అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని, ఇందుకు తన పూర్తి సహకారముంటుందని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మికాంత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, విద్య, వైద్య, సంక్షేమ శాఖాధికారులు, జుక్కల్ నియోజక వర్గ అధికారులతో ముఖాముఖి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య, వైద్య, మంచినీటి సరఫరా, రోడ్ల పై జుక్కల్ నియోజక వర్గంలో ప్రగతిలో ఉన్న పనులు, పెండిరగ్ సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా అవసరమైన మౌలిక వసతుల కల్పనలో అధికారులు చక్కటి కార్యాచరణ ప్రణాళికతో చిత్తశుద్ధిగా పనిచేయాలని కోరారు. విద్య, వైద్య శాఖలో డిప్యుటేషన్‌లో ఉన్న, ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు, ప్రగతిలో ఉన్న పనులు, సమస్యలపై రెండు రోజులల్లోగా నివేదిక అందజేయవలసినదిగా కోరారు.
గ్రామంలోని చివరి ఇంటి వరకు నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటూ అంతవరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్యం కోసం వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా వైద్య పరీక్షలు, టాయిలెట్స్ తదితర బీచిన్న చిన్న పనులు పూర్తి చేయాలన్నారు. విద్య అందించడం ఖర్చుగా కాకా పెట్టుబడిగా చూడాలని, విద్యార్థులు ఆహ్లాదకర వాతావరణంలో నాణ్యమైన విద్యనభ్యసించుటకు అవసరమైన మౌలిక వసతులతో పాటు విద్యార్థుల కనుగుణంగా పాఠశాలలో టీచింగ్ స్టాఫ్ ఉండేలా చూడాలన్నారు.
అదేవిధంగా సంక్షేమ వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. ప్రతి తండా, గ్రామానికి రోడ్డు రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండేలా చూడాలని అన్నారు. ఎంపిడిఓలు తమ మండలంలో గ్రామాలలో నెలకొన్న సమస్యలు తెలుసునని, అట్టి వివరాలను నిర్భయంగా తెలుపుతూ జాబితాను అందజేయాలని కోరుతూ, ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన మనం స్వేచ్ఛగా 20-20 మ్యాచ్ మాదిరి అత్యంత వేగవంతంగా పనిచేయాలని అధికారులకు హితవు పలికారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ వివిధ శాఖలలో ప్రగతిలో ఉన్న పనుల వివరాలతో పాటు ఇంతవరకు మొదలు పెట్టని, టెండర్ కానీ పనుల వివరాలు అందించాలన్నారు. విద్య, వైద్య, తదితర శాఖలలో ఉన్న సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తేవాలని అన్నారు. నివాస గ్రామం వారీగా మిషన్ భగీరథ నీరు సరఫరా కానీ ప్రాంతాలను గుర్తించాలన్నారు. వివిధ శాఖలలో ప్రగతిలో ఉన్న పనుల వివరాలతో పాటు ఇంతవరకు మొదలు పెట్టని, టెండర్ కానీ పనుల వివరాలు అందించాలన్నారు.
విద్య, వైద్య, తదితర శాఖలలో ఉన్న సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తేవాలని అన్నారు.సంక్షేమ వసతి గృహాలు మరింత మెరుగుపరచుదుటకు అవసరమైన మౌలిక సదుపాయాలపై నివేదిక అందించాలన్నారు.
నివాస గ్రామం వారీగా మిషన్ భగీరథ నీరు సరఫరా కానీ ప్రాంతాలను గుర్తించాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతుందని, ముగింపు దశలో ఉందని, వచ్చే పంటకాలానికి సరైన ప్రణాళిక రూపొందించవలసినదిగా వ్యవసాయ శాఖాధికారులకు సూచించారు. చెరువుకట్టల బండ్ స్ట్రెంత్ కొరకు ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. మొబైల్ క్లినిక్ ల ద్వారా పశు వైద్య సేవలందిస్తున్నామని ఎమ్మెల్యేకు తెలిపారు. బి.టి. రోడ్ల రెన్యువల్ చేపట్టాలని, వచ్చే సమావేశంలో శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాల కనుగుణంగా చేసిన పనులపై (పారా మీటర్) సమీక్షిస్తామన్నారు.
ఈ సందర్భంగా ఎంపిడిఓలు, అధికారుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పంచాయత్ రాజ్, ఆర్ అండ్ బి, నీటిపారుదల, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి లక్ష్మణ్ సింగ్, విద్యుత్ ఎస్ ఈ రమేష్ బాబు, పశు సంవర్ధక అధికారి సింహ రావు,, ఎస్సి కార్పొరేషన్ ఈ డి దయాకర్ రావు, భాగ్యలక్ష్మి, రమ్య, ఎంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.