వేల్పూర్, జూలై 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం వేల్పుర్ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసే విధంగా రైతులకు వ్యవసాయాధికారి నరసయ్య సూచనలు చేశారు. అనంతరం క్షేత్ర పర్యటన చేశారు. వ్యవసాయ అధికారి నరసయ్య మాట్లాడుతూ తమ సూచనల మేరకు వెంకటేష్ గౌడ్ అనే రైతు ‘‘నేరుగా విత్తే పద్ధతి’’ లో వరి పంట వేయడం జరిగిందన్నారు.
నేరుగా విత్తే పద్ధతిలో రైతులకి కూలీల ఖర్చు తగ్గడం, విత్తన ఖర్చు తగ్గడం జరుగుతుందని తెలిపారు. నేరుగా విత్తే పద్ధతిలో రైతుకి ఒక ఎకరాకి 6 వేల నుండి 7 వేల రూపాయలు ఆదా అవుతాయని వ్యవసాయాధికారి పేర్కొన్నారు. ఈ పద్ధతిలో ఒక ఎకరానా 10 నుండి 12 కిలోల విత్తనం సరిపోతుందని తెలిపారు. పొలంలో నీరు నిల్వ ఉండకుండా కలుపు తీసుకుని వరి విత్తనాన్ని 2 నుండీ 3 రోజులు నాన పెట్టి విత్తనం మొలక రాగానే ప్రదాన పొలంలో వెదజల్లుకోవాలని సూచించారు.
వరి విత్తనం వెదజల్లిన తర్వాత 48 గంటల లోపు పెన్ ఢీమిథిలిన్ 1 లీటర్ ఒక ఎకరా కు పిచికారి చేసుకోవాలన్నారు. 14 నుండి 20 రోజుల లోపు బిన్ పైరిబాక్ సోడియం 120 మిల్లీలీటర్ల కలుపు మందులు వాడాలని తెలిపారు. ఈ పద్ధతిలో సరైన సమయంలో పంట 7 నుండి 10 రోజుల ముందే పంట కోతకు వస్తదన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి నరసయ్య, రైతులు వెంకటేష్, ప్రవీణ్ తదితర రైతులు పాల్గొన్నారు.