ఎస్‌.శరత్‌ కుమార్‌ గౌడ్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూలై 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగపు పరిశోధకులు ఎస్‌. శరత్‌ కుమార్‌ గౌడ్‌ కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయబడిరది.

తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌, పార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ నసీం పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి ఎస్‌. శరత్‌ కుమార్‌ గౌడ్‌ ‘‘డిజైన్‌, సింథసిస్‌ ఆఫ్‌ బయలాజికల్లీ రిలవెంట్‌ నావెల్‌ నైట్రోజన్‌ ఎటిరోసైకిల్‌ ఆస్‌ పొటెన్షియల్లీ ఆక్టీవ్‌ మాలిక్యూల్స్‌’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించారు.

సోమవారం ఉదయం జరిగిన ఓపెన్‌ వైవా వోస్‌ (వర్చువల్‌) ఆన్‌ లైన్‌ వేదికకు ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగం నుంచి ప్రొఫెసర్‌ జె. రామచందర్‌ హాజరై పరిశోధకుడిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు.

వైవా వోస్‌కు సైన్స్‌ డీన్‌ ఆచార్య అరుణ చైర్మన్‌గా, బిఓఎస్‌ డా. సత్యనారాయణ కన్వీనర్‌గా వ్యవహరించారు. ప్రిన్సిపాల్‌ డా. వాసం చంద్రశేఖర్‌, డా. శిరీషా బోయపాటి, తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పార్మాస్యూటికల్‌ విభాగంలో గత పదకొండేళ్లుగా అకడమిక్‌ కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్‌. శరత్‌ కుమార్‌ గౌడ్‌ పిహెచ్‌. డి. సాధించడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం, కంట్రోలర్‌ డా. పాత నాగరాజు, పిఆర్‌ఓ డా. వంగరి త్రివేణి, తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాభినందనలు తెలిపారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »