డిచ్పల్లి, డిసెంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంపూర్ణ వాక్ మవ్ అనే హిందీ భాషా గ్రంధ ఖండిరకలును హిందీ విభాగ పి.హెచ్.డి పరిశోధక విద్యార్థి ప్రకాష్ తెలంగాణ విశ్వవిద్యాలయ లైబ్రరీకి అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ వర్సిటీ సెంటర్ లైబ్రరీకి అత్యంత విలువైన ఈ గ్రంథాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రంథాలు హిందీ భాషా అధ్యాపకులకు, పరిశోధకులకు, విద్యార్థులకు రిఫరెన్స్ గ్రంథాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో హిందీ విభాగ అధ్యక్షుడు డాక్టర్ ఎండి జమీల్, పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య యం అరుణ, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంట చంద్రశేఖర్, అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ బి సాయిలు, గ్రంథాలను అందించిన ప్రధాత ప్రకాష్ పాల్గొన్నారు.