ప్రారంభమైన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర

కామారెడ్డి, డిసెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అట్టడుగు వర్గాల స్థాయికి చేరుకోవాలన్నదే వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ప్రధాన ఉద్దేశ్యమని జిల్లాకు నోడల్‌ అధికారిగా నియమించిన భారత ప్రభుత్వ జాయింట్‌ సెక్రటరీ అశ్విని శ్రీవాత్సవ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాధామ్య పథకాలను అర్హులైన లబ్ధిదారుల చెంతకు తీసుకు వెళ్ళడమే కాకుండా, కొత్త లబ్ధిదారుల గుర్తింపులో భాగంగా దేశ వ్యాప్తంగా ఈనెల 16 నుండి జనవరి 26 వరకు ‘‘వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’’ అనే అవగాహన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.

అందులో భాగంగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడి వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం జిల్లాకు చేరిన 7 ప్రచార వాహనాలను కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో ప్రారంభించారు.
.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు మౌలిక సదుపాయాలైన పారిశుద్ధ్యం, ఆర్థిక సహాయం, ఎల్పీజీ కనెక్షన్లు, ఇండ్లు, ఆహార భద్రత, పౌష్టికాహారం, వైద్యం, విద్య, స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్య అందించడంలో భాగంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, ఇట్టి కార్యక్రమాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా అవగాహన కల్పించడంతో పాటు కొత్త లబ్ధిదారులను గుర్తించి వారికి కూడా అవగాహన కల్పించేందుకుగాను ఈ కార్యక్రమాన్ని భారత ప్రభువం చేపట్టిందని అన్నారు.

దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లాకు 7 ప్రచార రధాలు వచ్చాయని, వాటి ద్వారా జిల్లాలో నేటి నుండి 25 జనవరి 2024 వరకు ప్రతి రోజు 7 మండలాలలో ప్రతి మండలంలో 2 గ్రామాల చొప్పున జిల్లాలోని 526 గ్రామా పంచాయతీలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించే విధంగా వాహనం వారీగా రూట్‌ మ్యాప్‌, కార్యాచరణ రూపొందించామన్నారు.

అట్టి వాహనాలలో ప్రధాన మంత్రి సందేశం ఆడియో వీడియోతో పాటు ఎల్‌.ఈ.డి. స్క్రీన్స్‌ ద్వారా గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ప్రాధామ్య పథకాలైన ఆయుష్మాన్‌ భారత్‌- పి ఎం జె ఏ వై, పీఎం గరీబ్‌ కళ్యాణ్‌ అన్నా యోజన, దీన్‌ దయాల్‌ అంత్యోదయ యోజన, పీఎం ఆవాస్‌ యోజన, పీఎం ఉజ్వల యోజన, పీఎం విశ్వకర్మ, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌, పీఎం పోషన్‌ అభియాన్‌, హర్‌ ఘర్‌ జల్‌ – జల్‌ జీవన్‌ మిషన్‌, సర్వే ఆఫ్‌ విలేజెస్‌ అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రూవైస్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజెస్‌ ఏరియాస్‌, జన్‌దన్‌ యోజన, జీవన్‌ జ్యోతి బీమా యోజన, సురక్ష భీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన, నానో ఫెర్టిలైజర్‌ తదితర పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పధకాలపై గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ అవగాహన కల్పించడంతోపాటు ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే వారు నమోదు చేసుకునేలా ప్రోత్సహిస్తారన్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమాల విజయవంతానికి మండలానికి నోడల్‌ అధికారులను నియమించడంతో పాటు సంబంధిత శాఖలు చేపడుతున్న కార్యక్రమాలపై కరపత్రాలు, పుస్తకాలు ప్రజలకు అందజేసి ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాన్ని సేకరిస్తారన్నారు. ప్రజలు ఇట్టి క్యాంపులకు హాజరయ్యేలా గ్రామ కార్యదర్శులు గ్రామాలలో చాటింపు వేయాలని, కార్యక్రమాల ఫోటోలు, వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు విజయవంతం చేసేందుకు సహకారం అందించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించాలని, ఆయా పథకాలలో ఏ విధంగా లబ్ది పొందుతున్నారు, ఏ విధమైన లాభం జరుగుతుందన్నదన్నది లబ్ధిదారుల వ్యక్తిగత అనుభవాలను అందరితో పంచుకునేలా చూడాలన్నారు. ముందస్తు సమాచారం ఇచ్చి, కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు.

సంకల్ప్‌ యాత్ర విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. ఐటీ ప్లాట్‌ ఫామ్‌ లలో ప్రి – ఈవెంట్‌ సమాచారాన్ని అప్లోడ్‌ చేయాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ రత్నాబాయ్‌ ఆనంద రావు, లీడ్‌ బ్యాంక్‌ అధికారి భార్గవ్‌ కుమార్‌, జెడ్పి సీఈఓ సాయ గౌడ్‌, డి ఏం అండ్‌ హెచ్‌ ఓ లక్ష్మణ్‌ సింగ్‌, పాలౌర సరఫరా అధికారి మల్లికార్జున్‌ బాబు, పౌర సరఫరాల డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ అభిషేక్‌ సింగ్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »