అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కామారెడ్డి శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎస్‌జిఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి హాకీ క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడానికి విద్యాశాఖ, ఎస్‌ జి ఎఫ్‌, వ్యాయామ ఉపాధ్యాయులు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు.

రాష్ట్రస్థాయి క్రీడాకారులకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా క్రీడాకారులు, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయిలో రాణించి క్రీడ కోటాలో ఉద్యోగాలు సాధించాలని చెప్పారు. గతంలో భారతదేశం హాకీ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉండేదని తెలిపారు. తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి క్రీడాకారులు నిరంతరం ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు కామారెడ్డి లో నిర్వహించడానికి అధికారులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి హాకీ పోటీల నిర్వహణకు సహకారం అందించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో హాకీ పోటీల్లో రాణించాలని పేర్కొన్నారు. క్రీడా పోటీల్లో ఓటమి చెందిన వారు అసంతృప్తికి లోను కావద్దని, నేటి ఓటమి రేపటి గెలుపు నకు నాంది పలుకుతోందని తెలిపారు.

పది ఉమ్మడి జిల్లాలకు చెందిన 405 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నట్లు ఎస్‌ జి ఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాయబ్‌ రసూల్‌ తెలిపారు. మండల స్థాయి, జిల్లాస్థాయి క్రీడల నిర్వహణకు ఎమ్మెల్యే సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా యువజన, క్రీడల సంక్షేమ అధికారి దామోదర్‌ రెడ్డి, కౌన్సిలర్లు నరేందర్‌, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌ వ్యాయామ ఉపాధ్యాయులు ఆంజనేయులు, అశోక్‌, దయాకర్‌ రెడ్డి, రాజేందర్‌ రెడ్డి, నరసింహారెడ్డి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు దామోదర్‌ రెడ్డి, అనిల్‌ కుమార్‌, మనోహర్‌ మధుసూదన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »