వేల్పూర్, జూలై 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జర్నలిస్ట్‌లపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
విలేకరులపై దాడి ఒక పిరికిపందల చర్య అన్నారు. విలేకరులపై దాడులు జరుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని, అధికార పార్టీ నాయకులే విలేకరులపై దాడి చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమైన విషయమన్నారు. విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.