బాన్సువాడ, డిసెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ కార్మికులతో చైర్మన్, కమిషనర్ చర్చలు జరపడంతో చర్చలు విజయవంతమయ్యాయని మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తెలిపారు.
మున్సిపల్ కార్మికులకు రెండు సంవత్సరాల పిఎఫ్ డబ్బులు చెల్లించేందుకు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ రమేష్ కుమార్ అంగీకారం తెలపడంతో మున్సిపల్ కార్మికులు మంగళవారం నుండి విధుల్లోకి చేరనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, కౌన్సిలర్లు బాడి శ్రీనివాస్, కనుకుట్ల రాజు, హకీమ్, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.