డిగ్రీలో నలుగురు విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని యూజీ, పీజీ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాక్‌ పరీక్షలను పరీక్షల నియంత్రణ అధికారి పర్యవేక్షించారు.

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని యూజీ, పీజీ పరీక్షలను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య. ఎం.అరుణ, కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్‌ ఆరతి, అడిషనల్‌ కంట్రోలర్‌ బి సాయిలు యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజ్‌ సెంటర్లో పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా కంట్రోలర్‌ మాట్లాడుతూ యూజీ ఐదవ సెమిస్టర్‌ రెగ్యులర్‌, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం విద్యార్థులు 9797 మంది పరీక్ష ఫీజు చెల్లించినప్పటికీ ఇందులో పరీక్షకు హాజరైన వారి సంఖ్య 9164 మంది విద్యార్థులు మాత్రమే అని, 633 మంది విద్యార్థులు గైరాజరు అయ్యారని తెలిపారు.

యూజీ మధ్యాహ్నం జరిగిన ఒకటవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలకు మొత్తం విద్యార్థులు 8356 మంది విద్యార్థులు ఫీజు చెల్లించినప్పటికీ ఇందులో పరీక్షకు హాజరైన వారి సంఖ్య 7578 మందివిద్యార్థులు కాగా ఇందులో నలుగురు విద్యార్థులఫై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదైందని, 778 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు.

ఎంబీఏ, ఎంసీఏ మూడవ సెమిస్టర్‌, రెగ్యులర్‌ మరియు ఐఎంబిఏ తొమ్మిద సెమిస్టర్‌ పరీక్షలకు మొత్తం విద్యార్థులు 538 మంది ఫీజు చెల్లించినప్పటికీ ఇందులో పరీక్షకు హాజరైన వారి సంఖ్య 507 మందివిద్యార్థులు మాత్రమే అన్నారు. 31 మంది విద్యార్థులు గైరాజరయ్యారని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రకటనలో తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »