కామారెడ్డి, డిసెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపల్ విజయ్ కుమార్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భూములను కబ్జా చేయడానికి ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. శిశు మందిర్ యాజమాన్యం 2018 ఫిబ్రవరిలో రెండు ఎకరాల తప్పుడు లీజు రిజిస్ట్రేషన్ చేయించుకొని భూకబ్జాలకు పాల్పడుతుందని ఆరోపించారు.
శిశు మందిర్ పాఠశాలను వెంటనే ప్రిన్సిపాల్ స్వాధీనం చేసుకొని, కర్షక్ బీ.ఎడ్ కళాశాలను ప్రభుత్వం ఆధీనంలో నడిపించాలని, చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు.. వినతిపత్రం ఇచ్చిన వారిలో బీడీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌ఎన్ ఆజాద్, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు ఐరేని సందీప్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ముదాం అరుణ్, బివిఎం రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విటల్, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు కుంభాల లక్ష్మణ్ యాదవ్, బీసీ వి ఎస్ జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, బీడీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.