కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటా

కామారెడ్డి, డిసెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం రాజారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి బీజేపీ కార్యకర్తల కష్టం, నియోజకవర్గ ప్రజల భిక్ష ఈ ఎమ్మెల్యే పదవి అని, పార్టీ కోసం నిస్వార్ధంగా గత 5 ఏళ్ల నుండి పని చేసిన ప్రతి కార్యకర్తకు జీవితాంతం రుణ పడి ఉంటానని అన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉందాం – ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుదాం అని పిలుపునిచ్చారు. ప్రజల వద్దకు వెళ్ళి పాలన చేసి కామారెడ్డి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని అన్నారు. బీజేపీ పార్లమెంటు ఇంఛార్జి బద్దం మహిపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ఇద్దరు ఉద్దండులను ఓడిరచిన చరిత్ర రమణారెడ్డి తో పాటు ప్రతి బీజేపీ కార్యకర్తకు చెందుతుందని అన్నారు. ఇదే స్ఫూర్తితో పని చేసి రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాషాయ జండా ఎగరడం ఖాయం అని అన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తారా మాట్లాడుతూ గత ఐదేళ్లుగా చేసిన ఉద్యమాలు, నిత్యం ప్రజల మద్య ఉంటూ పార్టీ కోసం పని చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడిన ఫలితం ఇప్పుడు కామారెడ్డిలో బీజేపీ గెలుపు అని అన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »