కామారెడ్డి, జూలై 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ శశాంక్ ఆసుపత్రిలో డెంగ్యూతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న కామారెడ్డి పట్టణ లింగపూర్ గ్రామానికి చెందిన భూపాల్ రెడ్డికి ఏ,బి పాజిటివ్ రక్త కణాలు అత్యవససరం ఏర్పడిరది. దీంతో రక్త దాతల సమూహం ఏబివిపి వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన సమాచారానికి రాజంపేట గ్రామానికి చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు కార్యకర్త బొర్ర శ్రీనివాస్ గౌడ్ వెంటనే స్పందించారు.
అర్ధరాత్రి సైతం నిజామాబాద్ వరకు వెళ్లి రక్తకణాలు దానం చేసి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం డెంగ్యూతో చాలామంది చికిత్స పొందుతున్నారని యువకులు రక్తకణాలు దానం చేయడానికి ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ముందుకు రావాలని కోరారు. రక్త కణాలు దానం చేసి అతని మానవతా దృక్పధాన్ని చాటుకొని యువకులకు ఆదర్శంగా నిలిచిన శ్రీనివాస్ గౌడ్‌కి చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.