బాన్సువాడ, డిసెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్
బీర్కూరు మండలంలోని దామరంచ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం భారత మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయిని శంకర్ పివి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సంస్కరణలు, సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి కొత్త కాపు కాంత్ రెడ్డి, తోట నారాయణ ఉపసర్పంచ్ సాయిలు, సొసైటీ డైరెక్టర్ బోయిని గంగాధర్, లక్ష్మీనారాయణ,ఆసిఫ్, బామని సుభాష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.