కామారెడ్డి, డిసెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అయోధ్య అక్షింతలు కామారెడ్డి నగరానికి వచ్చిన సందర్భంగా తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షింతల కలశాలతో నగరపురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు ఈ యాత్ర ధర్మశాల నుండి రైల్వే స్టేషన్ బాంబే క్లాత్ పాన్ చౌరస్తా గర్ల్స్ హై స్కూల్ కోడూరి హనుమాన్ మందిర్ పెద్ద బజార్ మీదుగా నిజాం సాగర్ చౌరస్తా నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మభూమి రోడ్ కొత్త బస్టాండ్ నుండి శ్రీ సరస్వతి విద్యా మందిర్ లో శాంతి మంత్రముతో ముగిసింది ధర్మశాల దగ్గర శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి తో జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు గంగారెడ్డి, కోశాధికారి నిత్యానందం కార్యక్రమం నిర్వాహణ అంతా జిల్లా కార్యదర్శి బొల్లి రాజు పర్యవేక్షించారు
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర తీర్థ క్షేత్ర సంపర్క అభియాన్ ప్రాంత సంయోజక్ గణపురం రాజేశ్వర్ రెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ మర్యాద పురుషోత్తముడు భగవాన్ శ్రీ రామచంద్రుల భవ్య దివ్య మందిరం అయోధ్య మందిర్ అని స్వామీజీల ఆకాంక్ష స్వప్నం సాకారం అవుతుందని, రామ మందిర నిర్మాణమే హిందువుల స్వాభిమాన సంకేతం ధర్మానికి ప్రతిక సాంస్కృతికి ప్రత్యేక హిందూ కుటుంబం అంటేనే శ్రీరాముని జీవితం, ఒక ఆదర్శ జీవితం అలాంటి మహాపురుషుని మందిర నిర్మాణం బాల రాముని విగ్రహ ప్రతిష్ట జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రాణ ప్రతిష్ట మందిరం కేంద్రంగా కలిసి సామూహిక సంకీర్తన హనుమాన్ చాలీసా రామరక్షా స్తోత్రం సామూహిక హారతి ప్రసాదం తరువాత దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందన్నారు.
అందరూ చూసేటట్లు తరువాత పంచభూతాలను ప్రసన్నం చేసుకోవడానికి ఆహ్వానించి ఐదు జ్యోతులను వెలిగించాలి దీనికిగాను ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి జనసంపర్కాభియాన్ జనవరి 1 నుండి 15 వరకు ఉంటుందన్నారు. జనసంపర్క అభియాన్‌లో ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతలు అయోధ్య మందిర కరపత్రాలు అయోధ్య మందిర చిత్రపటం ఇస్తున్నట్లు అందరూ ఈ కార్యక్రమంలో సహకారం అందించి, 22వ తేదీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అక్షింతలు 700 గ్రామాలకు కలశాలలో తయారుచేసి ఇచ్చామని ఈ కార్యక్రమంలో మద్యమద్య హారతులతో రామభక్తులు శ్రద్ధా భక్తులను ప్రసాదించారన్నారు. రాముడు సీతా లక్ష్మణ హనుమాన్ స్వామి వేషధారణలో శిశుమందిర్ విద్యార్థులతో సాంస్కృతిక కోలాటం, చెక్క భజన కార్యక్రమంలో అలరించి రామ భక్తిని చాటి రాముని కృపకు పాత్రులు అయ్యేటట్లు కార్యకర్తలు జైశ్రీరామ్ నినాదాలతో అలరించారన్నారు.
కార్యక్రమంలో రామలింగారెడ్డి నగర అధ్యక్షులు, ధనుంజయ్ విశేష సంపర్క ప్రముఖ్, వెంకటస్వామి, పాపారావు, వంగ ప్రసాద్, మంచాల రాజు, అనిల్, భాగ్యలక్ష్మి, వరలక్ష్మి జ్యోతి, రాణి మాతృమూర్తులు వేలాదిమంది యాత్రలో పాల్గొన్నారు.