రక్తదానం చేసిన విలేఖరి

కామారెడ్డి, డిసెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో రేఖ (22) మహిళ రక్తహీనతతో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలుకు తెలియజేశారు.

వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన విలేకరి శ్రీకాంత్‌ రెడ్డి సహకారంతో ఏబి పాజిటివ్‌ రక్తాన్ని అందజేయడం జరిగిందన్నారు. రక్తదానానికి ముందుకు వచ్చిన శ్రీకాంత్‌ రెడ్డికి ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ పూర్వా చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు.

రక్తదానం పట్ల అపోహలు విడనాడాలని రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు. కార్యక్రమంలో కేబిఎస్‌ రక్తనిధి కేంద్రం టెక్నీషియన్లు జీవన్‌, సంపత్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »