ఆర్మూర్, డిసెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ధర్మాన్ని పరిరక్షించుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలోని భక్త హనుమాన్ ఆలయంలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గంలో గుడి గంటలు, బడి గంటలు కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు శివరాజ్ కుమార్ మాట్లాడుతూ 29 వారాలుగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నామని తెలిపారు.
జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గోసికొండ అశోక్ మాట్లాడుతూ కాలనీలో ఓపెన్ జిమ్, కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యేను కోరారు. స్థానిక కౌన్సిలర్ నర్సింహా రెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, డ్యాగ ఉదయ్, నల్ల రాజారామ్, వివిధ సంఘాల, కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.