ఆర్మూర్, డిసెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ఆర్మూర్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాస్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కలిశారు. అంకాపూర్లోని ఎమ్మెల్యే నివాసంలో పైడి రాకేష్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించారు. రానున్న రోజుల్లో క్రైస్తవ సంక్షేమం కోసం తన వంతు సహాయం అందించాలని ఆయనను వారు కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తాను కుల మతాలకు అతీతంగా సేవే పరమావధిగా భావించి రాజకీయాలలోకి వచ్చానని, రానున్న రోజుల్లో మానవత్వంతో క్రీస్తు బోధనలను అనుసరించాలని కోరారు.
అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్మూర్ మండల పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాస్టర్ ప్రకాష్, కార్యదర్శి ఆగస్టీన్, కోశాధికారి షడ్రక్, కార్యవర్గ సభ్యులు, క్రైస్తవ నాయకులు పాల్గొన్నారు.