కామారెడ్డి, డిసెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చాలన్లో తగ్గింపునకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కోర్టు సూపర్డెంట్ చంద్రసేనారెడ్డి తెలిపారు.
కామారెడ్డి జిల్లా కోర్టు నందు ఈనెల 27 నుంచి 30 వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చాలాన్ డబ్బులను చెల్లించవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.