కామారెడ్డి, డిసెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
లోక్ అదాలత్ సందర్బంగా కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా పోలీస్ శాఖ కామారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు కౌంటర్‌ను శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. ఎన్. శ్రీదేవి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
పెండిరగ్ చలాన్ల డబ్బులు ఇక్కడ సులభంగా చెలించుకోవచ్చునని తెలిపారు. ఈ కౌంటర్ ద్వారా ట్రాఫిక్ చలాన్లు తగింపు ధరలో చెల్లించుకోవచ్చునని చెప్పారు. రాష్ట్ర పోలీసు శాఖ ద్విచక్ర వాహనాల, త్రిచక్ర వాహనాలపై 100 శాతంలో 20 శాతం చెల్లింపు, తోపుడు బండ్లకు 100 శాతంలో 10 శాతం చెల్లింపు, 100 శాతంలో 40 శాతం కార్, హెవీ వెహికల్స్‌కి చెల్లింపు కొరకు జివో జారీచేసినట్లు చెప్పారు.
కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజగోపాల్ గౌడ్, అశోక్, నంద రమేష్, దామోదర్ రెడ్డి హాజరయ్యారు. న్యాయవాదులు సిద్ద రాములు, నర్సింహారెడ్డి, న్యాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భుజంగరావు, కోర్టు సూపరింటెండెంట్లు వెంకట్ రెడ్డి, శ్రీధర్, చంద్రసేన్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.