ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఇటీవల జరిగిన రాష్ట్ర శాసన సభ – 2023 ఎన్నికల్లో నిజామాబాద్‌ జిల్లాలోని ఆయా సెగ్మెంట్ల నుండి పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల సందర్భంగా చేసిన ఖర్చు మొత్తాలను సరిచూసుకుని, అవసరమైన వివరాలను నిర్ణీత గడువులోపు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ సూచించారు. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు చేసిన ఖర్చుల వివరాలను సరిపోల్చుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్లో)లోని సమావేశ మందిరంలో శుక్రవారం రికన్సీలేషన్‌ నిర్వహించారు.

ఎన్నికల వ్యయ పరిశీలకులు శక్తి, పాటిల్‌ చిన్మయి ప్రభాకర్‌ లు విచ్చేసి, అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలను, వ్యత్యాసాలను పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చుకు సంబంధించి రోజువారీ ఖాతా రిజిస్టర్‌, నగదు లావాదేవీల రిజిస్టర్‌, బ్యాంక్‌ రిజిస్టర్‌, స్టేట్‌మెంట్‌ (పార్ట్‌-1 నుండి 4 వరకు), షెడ్యూల్‌ లో 1 నుండి 11 వరకు గల ఎన్నికల ఖర్చుల వివరాలను సరి చూసుకుని సరైన క్రమసంఖ్యతో కూడిన అన్ని బిల్లులు, వోచర్లు, ఒరిజినల్‌ అఫిడవిట్‌, స్వీయ ధృవీకరణతో కూడిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ తదితర వాటిని ఎన్నికల ఫలితాలు ప్రకటించబడిన 30 రోజులలోపు సమర్పించాల్సి ఉంటుందన్నారు. గడువు ముగియనున్న నేపథ్యంలో రికన్సీలేషన్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

బ్యానర్స్‌, పోస్టర్స్‌, దినపత్రికలు, టీవీ ఛానల్‌ లో ఇచ్చిన యాడ్స్‌ వివరాలు, వాటికైనా ఖర్చుల వివరాలు కూడా తెలియజేయాలని సూచించారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లకు సరైన రీతిలో ఖర్చుల వివరాలను సమర్పించేలా ఏఈఓలు మార్గనిర్దేశం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను సకాలంలో, నిర్ణీత పద్దతిలో సమర్పించని పక్షంలో అలాంటి వారికి నోటీసులు జారీ చేస్తామని, నిర్ణీత కాల వ్యవధిలోపు స్పందించని వారిపై ఆర్‌.పీ.చట్టం, 1951లోని సెక్షన్‌ 10 ఏ ప్రకారం అనర్హత విధించాలని కోరుతూ, ఎలక్షన్‌ కమిషన్‌ కు లేఖ పంపడం జరుగుతుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

ఈ.సి ద్వారా అనర్హులుగా ప్రకటించబడిన వారు మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కోల్పోతారని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, జిల్లా ఎన్నికల వ్యయ కమిటీ నోడల్‌ అధికారి పాపయ్య, ఆయా నియోజకవర్గాల నుండి పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »