నిజామాబాద్, డిసెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈ నెల 30 శనివారం రోజున జిల్లాలోని 93 గ్రామాలలో ప్రజాపాలన సభలను నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. డీపీఓ తెలిపిన ప్రకారం శనివారం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనున్న గ్రామాల వివరాలిలా ఉన్నాయి.
ఆర్మూర్ నియోజకవర్గం లోని జిజి.నడకుడ, నికాల్పుర్, బాద్గుణ, సీహెచ్.కొండూరు, షాపూర్, ఉమ్మెడ, మిర్దాపల్లి, రాంచందర్పల్లి, గోవింద్ పెట్, రాంపూర్, అంకాపూర్, ఇస్సాపల్లి, మదనపల్లి, సట్లపూర్ తండా, చెక్కి, వల్లభాపుర్ లలో ప్రజాపాలన సభలు నిర్వహించనున్నారు.
అలాగే బాల్కొండ నియోజకవర్గంలోని బోదేపల్లి, వన్నెల(బి), ముచ్కూర్, సంతోష్ నగర్ తండా, పళ్ళికొండ, సుదర్శన్ నగర్ తండా, ముప్కాల్, బుస్సాపూర్, చాకిరియాల్, కోడిచెర్ల, సావెల్, దొంపాల్, మోర్తాడ్,
బోధన్ నియోజకవర్గం లోని భూలక్ష్మి క్యాంప్, పెంటాకాలాన్, పెంటాఖుర్దు, పెంటాఖుర్దు క్యాంప్, నవీపేట్, స్టేషన్ ఏరియా, నాగేపూర్, పొతంగల్, వీరన్నగుట్ట, వీరన్నగుట్ట తండా, కందకుర్తి, సాటాపూర్, మందర్న, సాలంపాడ్, తానాకలాన్, ఎడపల్లి, అంబం(వై), ఏ.ఆర్.పీ క్యాంప్,
నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ పరిధిలోని చల్లగరిగా, ధనంబండతండా, బెలియాతండా, మరియతండా, అమృతపూర్, గొల్లపల్లి, బర్దీపూర్, ముల్లంగి(ఐ), డోన్కల్, జి.కె.తండా, సిర్నాపల్లి, స్టేషన్ తండా, మాదాపూర్, మునిపల్లి, నల్లగుట్ట తండా, సికింద్రాపూర్, న్యాల్కల్, సిర్పూర్, బాడ్సి, సింగంపల్లి, జలాల్పూర్, పాల్డ, చక్రధర్ తండా, గాంధీనగర్, జంగిలోడి తండా, నర్సింగ్ పల్లి, గుడిమెట్ల తండా, సర్పంచ్ తండా గ్రామాలలో,
బాల్కొండ నియోజకవర్గంలోని హాసకొత్తూర్, కోనాపూర్, అమీర్ నగర్, చౌట్పల్లి, పడగల్, జానకంపేట్,
బాన్సువాడ సెగ్మెంట్ లోని దేవునిగుట్ట తండా, కొత్తపల్లి, రాంపూర్, సుద్దులం, హంగర్గా, హంగర్గాఫారం, బొప్పాపూర్, చిక్కడపల్లి, శ్రీనగర్, వర్ని, హుమ్నాపూర్, నెహ్రూనగర్ గ్రామాలలో ప్రజాపాలన సభలు జరుగనున్నాయి.