పీ.ఎఫ్‌ రీజినల్‌ కమీషనర్‌ మొండి వైఖరి విడనాడాలి

నిజామాబాద్‌, జూలై 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రావిడెంట్‌ ఫండ్‌ రీజనల్‌ కమీషనర్‌ మొండి వైఖరిని ఖండిస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యూ) రాష్ట్ర కమిటీ శ్రామిక భవన్‌, కోటగల్లీలో ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది.

ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పీ.ఎఫ్‌ రికార్డులు ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా రికార్డులతో సరిపోలక, సకాలంలో కేవైసి, ఈ-నామినేషన్‌ చేయించడంలో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారన్నారు.

ఈ విషయమై రీజనల్‌ కమిషనర్‌ని అపాయింట్మెంట్‌ తీసుకొని, కలవడానికి వెళ్లిన యూనియన్‌ రాష్ట్ర నాయకత్వ బృందంతో కమిషనర్‌ దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్మికుల గురించి యూనియన్‌ నాయకులు మాట్లాడే హక్కు లేదని, బయటకు వెళ్లండని కమీషనర్‌ దురుసుగా ప్రవర్తించారన్నారు. కార్మికుల గురించి యూనియన్‌ నాయకులు మాట్లాడే హక్కు లేదనడం కార్మిక చట్టాలను ఉల్లంఘించడమేనని అన్నారు.

అధికారులు ప్రజలకు, కార్మికులకు సేవకులు మాత్రమేనన్న విషయాన్ని మరువరాదని హితవు పలికారు. కమిషనర్‌ తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. ఇదే వైఖరి కొనసాగితే కమిషనర్‌ వైఖరికి నిరసనగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తమ పేర్ల తప్పుల సవరణ కోసం వేలాది మంది బీడీ కార్మికులు పీ.ఎఫ్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారని, అవి ఇంకా పెండిరగ్‌లో ఉన్నాయన్నారు.

తప్పుల సవరణలకు దరఖాస్తు చేసుకోని కార్మికులు కూడా వేలాదిగా ఉన్నారన్నారు. వీరందరికీ బీడీ యాజమాన్యాలు ధ్రువీకరించిన ప్రకారం, గెజిట్‌ నోటిఫికేషన్‌, ఆధార్‌ కార్డుల ఆధారంగా పీ.ఎఫ్‌ రికార్డులను సరిచేయాలని కోరుతున్నామన్నారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, లేనిచో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

సమావేశంలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్‌, ఉపాధ్యక్షులు రాజన్న, భూమేశ్వర్‌, రాజేశ్వర్‌, వెంకన్న, రాంప్రసాద్‌, కిషన్‌, సూర్య శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »