కామారెడ్డి, డిసెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి ఆర్.డి.ఓ శ్రీనివాస్ రెడ్డి కోరారు. శుక్రవారం మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న తీరును పరిశిలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని కుటుంభాలకనుగుణంగా ఉచితంగా ధరఖాస్తు ఫారాలు అందజేస్తుండడంతో పాటు ఫారం భర్తీకి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామని వారి సహాయంతో భర్తీ చేసిన ఫారాల వెంట రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులు సమర్పించి రసీదు పొందాలని ప్రజలకు సూచించారు. ఏ పథకాలకు అర్హులో ఆ పథకాలకు టిక్ చేస్తూ ఒక కుటుంభం నుండి ఒక దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుందని ప్రజలకు వివరించారు.
కాగా కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమాన్ని స్థానిక తహశీల్ధార్ లత పరిశీలించి లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. గూడెంలో 423 గృహాలున్నాయని, అభయహస్తం కు అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమాల్లో డి.పి .ఓ. సాయిబాబాబ, తహసీల్ధార్ శ్వేత, ఉప ఏతహసీల్ధార్ కిష్టయ్య, సర్పంచు స్వామి తదితరులు పాల్గొన్నారు.