కామరెడ్డి, డిసెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రైస్ మిల్లర్లు తమ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శనివారం రైస్ మిల్ యజమానులతో సమీక్ష నిర్వహించారు.
జనవరి 7 వరకు తమ లక్ష్యాలను పూర్తి చేయని రైస్ మిల్లు యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల మేనేజర్ అభిషేక్ సింగ్, జిల్లా సహాయ పౌరసరఫరాల అధికారి నిత్యానంద్, రైస్ మిల్లు యజమానులు పాల్గొన్నారు.