బోధన్, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని బోధన్ శివసేన అద్వర్యంలో ఆర్డివోకు వినతిపత్రం అందజేసినట్టు శివసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పసులోటి గోపి కిషన్ తెలిపారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గోవధ నిషేధ చట్టం 1977, పశువుల సంరక్షణ చట్టం 1960 ప్రకారం గోవధ చేయడం నేరం అని ప్రతి సంవత్సరం ఇట్టి విషయంలో ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చినా ప్రభుత్వం మాత్రం నామ మాత్రపు చర్యలతో సరిపెట్టుకుంటుందని మండిపడ్డారు. గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని లేకుంటే గోవధ చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రీతం, లోకేష్, బెగారి సాయి, నరేందర్, భూమేష్, గణేష్, సంతోష్, సిద్దు, గంగాధర్, చిన్న తదితరులు పాల్గొన్నారు.