జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఆంగ్ల నామ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుభాకాంక్షలు తెలిపారు. 2024 ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అభిలషించారు.

కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముందుకు సాగాలని, ఎల్లవేళలా మంచి జరగాలనే ఆకాంక్ష వెలిబుచ్చారు. 2023 లో ఎదురైన అనుభవాలను సానుకూలంగా మల్చుకుని, 2024 నూతన సంవత్సరంలో మరింత పట్టుదల, అవిరళ కృషితో విజయాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కొత్త సంవత్సరంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ జిల్లాను మరింత వడివడిగా ప్రగతి పథాన పయనింపజేసేందుకు కలిసికట్టుగా కృషిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి గెలుపునందించే సంవత్సరం కావాలని కలెక్టర్‌ అభిలషించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »