నిజామాబాద్, డిసెంబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆంగ్ల నామాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చేవారు పూల బొకేలకు బదులు నోట్ బుక్కులు, పెన్నులు, దుప్పట్లు వంటి వాటిని తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
శుభాకాంక్షల రూపకంగా సమకూరిన నోట్ బుక్కులు, పెన్నులు, దుప్పట్లను పేద విద్యార్థులకు అందజేయడం జరుగుతుందన్నారు. కావున పూల బొకేలు అందించదల్చిన వారు వాటి స్థానంలో నోట్ బుక్స్, బ్లాంకెట్స్ అందిస్తే విద్యార్థులకు అవి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయని అన్నారు.
కాగా, నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా పాలనాధికారి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) లో సోమవారం ఉదయం 11.00 గంటల నుండి అందుబాటులో ఉంటారని కలెక్టర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.