పకడ్బందీగా భవన నిర్మాణ అనుమతులు

కామారెడ్డి, జూలై 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లే- అవుట్‌ లకు, భవన నిర్మాణాలకు జిల్లా స్థాయి టాస్కుఫోర్సు కమిటీ ద్వారా టిఎస్‌ బి పాస్‌ అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేటు కాన్ఫరెన్సు హాలులో జిల్లాస్థాయి టిఎస్‌ బి పాస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా టిఎస్‌ బిపాస్‌ జిల్లా కమిటీ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ మాట్లాడుతూ జిల్లా స్థాయి లేఅవుట్‌ కమిటీ, ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ కమిటీల ఆధ్వర్యంలో తనిఖీలు, పరిశీలన నిర్వహించి లేఅవుట్‌లకు, భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. 2019 తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్‌ ప్రకారం టీఎస్‌ బిపాస్‌ అనుమతులకు కామారెడ్డి పరిధిలో ఆర్టీవో, తహసిల్దార్‌ ఆధ్వర్యంలో రెండు ఎన్‌ఫోర్సుమెంట్‌ టీములు, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆర్డీవోల ఆధ్వర్యంలో ఒక్కొక్క టీము పనిచేస్తాయని తెలిపారు.

డి.ఎస్‌.పి, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, ఆర్‌అండ్‌బి డిఇఇ, మున్సిపాలిటీ టిపిఎస్‌ సభ్యులుగా ఉంటారని తెలిపారు. లే అవుట్‌, భవన నిర్మాణాలు సంబంధించి సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. లేఅవుట్‌ లలో 10 శాతం ఓపెన్‌ స్పేస్‌ ఉండాలని, 15 శాతం ప్రభుత్వానికి మార్టిగేజ్‌ చేసి ఉండాలని, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, ఫ్లోర్స్‌ సంఖ్య నిబంధనలను అనుసరించి ఉండాలని తెలిపారు. ఫైనల్‌ పర్మిషన్‌ కోసం లేఅవుట్‌ కమిటీ క్షేత్రస్థాయిలో సందర్శించి నిబంధనల మేరకు అప్రూవ్‌ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

అనధికార లేఅవుట్లలో పనులు నిలిపి వేయడం జరుగుతుందని, జరిమానాలు, కూల్చివేతలు చేయడం జరుగుతుందని అన్నారు. పోస్ట్‌ వెరిఫికేషన్‌ కింద సైట్‌ వెరిఫికేషన్‌, ప్లానింగ్‌ తేడాలు పరిశీలించి డాక్యుమెంట్‌ ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఎన్‌ఫోర్సుమెంట్‌ టీం క్రాస్‌ చెక్‌ చేసుకుని పూర్తి వివరాలను డిస్ట్రిక్ట్‌ టాస్క్‌ఫోర్సు కమిటీకి అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ నెలాఖరులోగా ఎన్ని అనుమతులు వచ్చాయి అనేది పూర్తి వివరాలతో సమర్పించాలని ఈ సందర్భంగా కమిటీలను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. బి పాస్‌ భవన నిర్మాణ అనుమతులు సింగిల్‌ విండో పద్ధతిలో 21 రోజుల్లోనే ఇవ్వడం జరుగుతున్నది తెలిపారు. భవన నిర్మాణ లేఅవుట్లలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

సమావేశంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఎన్‌.శ్వేత, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే, ఆర్డీవోలు ఎస్‌.శీను, రాజాగౌడ్‌, అడిషనల్‌ ఎస్‌.పీ. అన్యోన్య, మున్సిపల్‌ కమిషనర్లు దేవేందర్‌, రమేష్‌ పంచాయతీరాజ్‌ ఈఈ వీరానందరావు, ఆర్‌అండ్‌బి డీఈ శ్రీనివాస్‌, శ్రీనివాస్‌ నీటిపారుదలశాఖ ఇఇ నర్సింగరావు, మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి శైలజ, అధికారులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »