కామారెడ్డి, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఉదయము 5 గంటలనుండి 11 గంటల వరకు, ఎల్లారెడ్డి డిఎస్‌పి ఏ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ చెడ్మాల్ తండా, నేరెల్ తండా, బిర్మల్ తండా గ్రామాలలో పరిసర ప్రాంతాల్లో సిఐ సదాశివనగర్, సిఐ ఎల్లారెడ్డి, జిల్లాలోని (14) ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు ( 3) ఐదుగురు హెడ్ కానిస్టేబుల్‌లు (37) మంది పోలీసు కానిస్టబుల్‌లు, (9) మంది హోమ్ గార్డులు (17) మంది రిజర్వ్ పోలీసులు, మొత్తం (87) మంది వివిధ టీములు గా ఏర్పడి పైన తెలిపిన మూడు గ్రామాల్లో గంజాయి మొక్కల సాగు గురించి విసృతంగా తనిఖీలు నిర్వహించారు.
చెద్మాల్ తండా గ్రామంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి నుండి (15) కిలోల ఇప్పపూవు స్వాధీనం చేసుకున్నారు. ఇకముందు కూడా గంజాయి సాగు గురించి ప్రతి రోజూ తనిఖీలు నిర్వహించ బడుతాయని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి గంజాయి కలిగియున్న, సాగుచేసిన, అక్రమ రవాణా చేసిన మరియు విక్రయించిన వారిపైన చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి డిఎస్పీ తెలిపారు.