కామారెడ్డి, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం సమీక ృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మొదటి అంతస్తులో క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు, పనిచేసే ఉద్యోగులకు నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు అందుబాటు రేట్లకు విక్రయించాలని క్యాంటీన్ నిర్వాహకులకు సూచించారు.
కార్యక్రమంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్. శ్వేత, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, కలెక్టరేట్ ఏవో రవీందర్, క్యాంటీన్ నిర్వాహకులు కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.