బాన్సువాడ, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో 2024 సంవత్సరానికి సంబందించిన టిపిటిఎఫ్ కాలమనిని మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు ఆవిష్కరించారు.
అనంతరం టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేద, నిరుపేద విద్యార్థులే చదువుకుంటారని ప్రభుత్వం పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని, తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని, సర్వీస్ పర్సన్స్‌ను నియమించి, సిపిఎస్‌ను రద్దు పరిచి ఓపిఎస్ ను కల్పించాలని, ఉపాధ్యాయులను గందర గోళానికి గురిచేస్తున్న ఉన్నతి, ఎఫ్‌ఎల్‌ఎన్‌లను రద్దుపరిచి ఉపాధ్యాయులను స్వేచ్చాయుత వాతావరణంలో బోధించే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.
కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగేశ్వర్ రావు, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, సాయిలు, మండల అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు, మచ్చేందర్, బీర్కూర్ బాద్యులు ప్రమోదకుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.