కామారెడ్డి, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బ్లడ్ బ్యాంక్లో రక్తనిలువలు లేవని తెలుసుకొని 30వ సారి రక్తదానం చేసిన రక్తదాతల ఫ్యామిలీ గ్రూప్ నిర్వాకులు బోనగిరి శివకుమార్. గత 10 సంవత్సరాలుగా స్వచ్చందంగా వివిధ సేవ కార్యక్రమాలు చేస్తూ రక్తదాతల గ్రూప్ ఆధ్వర్యంలో దాదాపు 110 మందికి రక్తం అందించి ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా రక్తదాతల గ్రూపు నిర్వాహకులు ఎనుగందుల నవీన్, కొత్మిర్ కార్ రామకృష్ణ వారిని అభినందించారు. కార్యక్రమంలో మన్నె కృష్ణ, జిల్లాల రమేష్ రెడ్డి, చంద్రశేఖర్, అరవింద్, గంగులు, వీటి ఠాగూర్ రక్తనిధి కేంద్రం నిర్వాహకులు చందన్ తదితరులు పాల్గొన్నారు.