నిజామాబాద్, మే 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాల ఫేర్ వెల్ డే కార్యక్రమం అంగరంగా వైభవంగ న్యూ అంబేద్కర్ భవన్ ఆడిటోరియంలో జరిగింది. కళాశాల మొదటి మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చివరి సంవత్సరం విద్యార్థుల కొరకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసారు. నగరంలోని ప్రముఖ నృత్య దర్శకులు వినయ్ విద్యార్థులచే అద్భుతమైన నృత్యాలు చేయించారు.
అదేవిధంగా ప్రముఖ కూచిపూడి నృత్య గురువులు వారి శిష్యులచే స్వాగతనృత్యం చేయించారు. కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ మాట్లాడుతూ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు భారతీయులవుతారు కాని హిందూ ముస్లిం క్రిస్టియన్లు కారు అని అన్నారు. విద్యార్థి దశలోనే దేశభక్తి నిండుగా ఉంటదని గుర్తు చేసారు. మంచిగ చదువుకొని జీవితంలో సక్సెస్ సాధించి దేశం యొక్క రుణం తీర్చుకోవాలని నరాల సుధాకర్ అన్నారు.
కార్యక్రమంలో నరాల స్వప్న, ప్రిన్సిపల్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ నరేష్, కొయ్యాడ శంకర్, సందేష్, సందీప్, శ్రీనివాస్, విజయ్, సీనియర్ అధ్యాపకులు కళ్యాణి, సలేహ, అనురాధ, నిసార్ అలి, అరవింద్, కవిత, కేసరి, సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.