డిగ్రీ పరీక్షలకు సర్వం సిద్దం

డిచ్‌పల్లి, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

డిగ్రీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య యాదగిరి అన్నారు. ఆయా కళాశాల పరీక్ష కేంద్రాల్లో చీఫ్‌ సూపరింటెండెంట్‌గా వ్యవహరించే వారు పేపర్‌ డౌన్‌లోడ్‌ చేసే సమయానికి విధిగా పరీక్ష కేంద్రంలో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు అనివార్యమైన, అత్యవసర పనుల ఏమైనాఉంటే విధిగా అక్కడ పనిచేస్తున్న మరోఅధికారికి లిఖిత పూర్వకంగా బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఇదే విషయాన్ని వర్సిటీ ఆడిట్‌ సెల్‌ లేదా పరీక్షల విభాగం అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం వర్సిటీ లో ఏర్పాటుచేసిన వివిధ పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్‌లతో అకడెమిక్‌ ఆడిట్‌ సెల్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 21 నుండి జూన్‌ 15 వరకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 38 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించ నున్నట్టు తెలిపారు. 2, 4, 6 సెమిస్టర్స్‌ రెగ్యులర్‌ పరీక్షలకు దాదాపు 24 వేల మంది, 1, 3, 5 సెమిస్టర్‌ పరీక్షల 14 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

ఎలాంటి లొసుగులు లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్ష పత్రం డౌన్‌లోడ్‌ చేసే సమయంలో యూనివర్సిటీ నియమించిన అబ్జర్వర్‌ తో పాటు ప్రిన్సిపల్‌ లేదా చీఫ్‌ సూపరింటెండెంట్‌ తప్పనిసరి ఉండాలని చెప్పారు. ఈసారి పరీక్షలకు ప్రత్యేక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్‌లు వినియోగించ కూడదని సూచించారు.

ఈ సమావేశం పై ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కొంతమంది ప్రిన్సిపళ్లు మరీ ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపళ్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజర్‌ అవడం పట్ల అసహనం వ్యక్తం చేసిన ఆయన ఆయా ప్రిన్సిపల్‌ నుండి వివరణ కోరాలని ఆడిట్‌ సెల్‌ అధికారులకు సూచించారు.

సమావేశంలో పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ అకడెమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య గంటా చంద్ర శేఖర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ అతీక్‌ సుల్తాన్‌ ఘోరీ పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »