బడులు ప్రారంభం అయ్యే నాటికి పనులన్నీ పూర్తి కావాలి

నిజామాబాద్‌, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రాష్ట్ర వ్యాప్తంగా గల ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని, బడులు పునః ప్రారంభం అయ్యే నాటికి పనులన్నీ పూర్తి కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. కొత్త విద్యా సంవత్సరంలో బడులు తెరుచుకునేందుకు మరో 20 రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్నందున యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి గడువులోపు పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులతో పాటు, ధరణి దరఖాస్తులు, ప్రజావాణి అర్జీలు, ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్‌ లక్ష్య సాధన అంశాలపై శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను రాష్ట్రంలో శాంతియుత వాతావరణంలో, సజావుగా నిర్వహించడం పట్ల అన్ని జిల్లాల కలెక్టర్లను సీ.ఎస్‌ ముందుగా అభినందించారు.

కాగా, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో సగానికి పైగా జిల్లాలు దాదాపు 90 శాతం వరకు పనులను గ్రౌండిరగ్‌ చేశాయని, మిగతా జిల్లాలు కూడా అన్ని పనులు గ్రౌండిరగ్‌ అయ్యేలా చూడాలన్నారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని, అదే సమయంలో పనులు నాణ్యతతో జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ముఖ్యంగా బాలికలు ఉండే ప్రతి బడిలో తప్పనిసరిగా టాయిలెట్స్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఊరు – మన బడి కింద ఇప్పటికే చేపట్టి వివిధ దశల్లో ఉన్న పనులను సైతం పూర్తి చేయించాలన్నారు.

విద్యార్థులకు పాఠశాలల పునఃప్రారంభం సమయానికే స్కూల్‌ యూనిఫారంలు, పాఠ్య పుస్తకాలు అందించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు యూనిఫామ్‌ క్లాత్‌ ను సరఫరా చేయడం జరిగిందని, ఎక్కువ సంఖ్యంలో మహిళా సంఘాలకు వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చి, సకాలంలో వారు విద్యార్థుల సంఖ్యకు సరిపడా పూర్తిస్థాయిలో స్కూల్‌ యూనిఫామ్‌లు తయారు చేసి ఇచ్చేలా చూడాలన్నారు. ఇదిలా ఉండగా, ధరణి పెండిరగ్‌ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సీ.ఎస్‌ సూచించారు. ఆర్డీఓలు, తహశీల్దార్లతో సమీక్ష ఏర్పాటు చేసుకుని, వివిధ మాడ్యూల్స్‌ కింద వచ్చిన దరఖాస్తులను ఈ నెలాఖరు లోగా వందకు వంద శాతం పరిష్కరించాలని అన్నారు.

అలాగే, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత జిల్లాలకు పంపించడం జరుగుతోందని, వాటిని వెంటదివెంట పరిష్కరించాలన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ దృష్ట్యా తాత్కాలికంగా ప్రజావాణిని నిలిపివేయడం జరిగిందని, ఎన్నికల కోడ్‌ ముగిసిన మీదట యధావిధిగా కొనసాగుతుందని సీ.ఎస్‌ స్పష్టం చేశారు. ప్రజావాణి తిరిగి ప్రారంభించే లోపు పెండిరగ్‌ అర్జీలను పరిష్కరిస్తూ, దరఖాస్తుదారులకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. కాగా, కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం సేకరణను వేగవంతం చేస్తూ, వెంటదివెంట నిల్వలను రైస్‌ మిల్లులకు తరలించాలని సూచించారు.

అదేసమయంలో మిల్లులు పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు మిల్లింగ్‌ జరిపేలా పర్యవేక్షణ చేస్తూ, సీఎంఆర్‌ లక్ష్య సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ విషయమై కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు స్పందిస్తూ, ఈ దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని సీ.ఎస్‌ దృష్టికి తెచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌ కుమార్‌, డీఆర్డీఓ సాయాగౌడ్‌, డీఎస్‌ఓ చంద్రప్రకాష్‌, సివిల్‌ సప్లైస్‌ డీ.ఎం జగదీశ్‌, డీఈఓ దుర్గాప్రసాద్‌, డీసీఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »