కామారెడ్డి, మే 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రధాన రహదారిలో ఉన్నటువంటి స్వీట్ హోమ్స్ ను ఫుడ్ సేఫ్టీ అధికారి సునీత శనివారం ఆకస్మికంగా తనకి చేశారు. అక్కడ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిసరాలను, వస్తు సామాగ్రిని, ప్యాక్డ్ మెటీరియల్స్ యొక్క ఎక్స్పైరీ డేట్‌ను పరిశీలించి పెనాల్టీలు విధించారు.
అక్కడ వివిధ రకాల వస్తువుల శాంపిల్స్ సేకరించి హైదరాబాదులోని ల్యాబ్‌కు టెస్టింగ్ కొరకు పంపారు. తనిఖీలో ఫుడ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ శిరీష, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.