కామారెడ్డి, మే 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బెస్ట్ అవైలబుల్ పధకం క్రింద 2024-25 విద్యాసంవత్సరంలో 3,5,8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
3వ తరగతిలో బాలురకు 7, బాలికలకు 4, 5వ తరగతిలో బాలురకు 4, బాలికలకు 2, 8వ తరగతిలో బాలురకు 3, బాలికలకు 2 సీట్లు కలవని ఆయన తెలిపారు. ప్రవేశానికై తలిదండ్రుల వార్షికాదాయం పట్టణ ప్రాంతాలలో 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో ఒకటిన్నర లక్ష ఉండాలని, దరఖాస్తు వెంట ఆదాయ ధ్రువీకరణ, ఆధార్ కార్డు, పూర్వపు తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, బోనఫైడ్ జతపరచి జూన్ 6 న సాయంత్రం 5 గంటలలోగా కలెక్టరేట్ లోని రెండవ అంతస్తులో గల 208 నెంబరు గదిలో ఉన్న జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని అంబాజీ తెలిపారు.
జూన్ 12 న జిల్లా ఎంపిక కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంపిక జరుగునని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు ఫారం, ఇతర వివరాల కొరకు కార్యాలయ పనివేళలో సంప్రదించవలసినదిగా అంబాజీ తెలిపారు.