కామారెడ్డి, జూలై 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్‌లో గల మదీనా మజీద్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కుటుంబ సభ్యులతో పండగ చేసుకొని ప్రార్థనలు చేశారు. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడాలని దేవునితో ప్రార్థించానని చెప్పారు. కరోనాతో ఒక సంవత్సర కాలం నుండి పనులు దొరకక ఉపవాసాలు బాధలతో ఉండి కరొనతొ అల్లాడుతున్న ప్రజలకు ఇప్పుడిప్పుడే కొద్దిగా తగ్గుముఖం పట్టి ప్రజలు బయటకు వచ్చి పనులు చేసుకుంటున్నారు, వారికి ఒకటే విన్నపం ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి కరోనా నిబంధనలు తప్పనిసరి పాటించాలని అన్నారు.
చాలా మంది ముస్లింలు ఈయేడు షాపింగ్‌లు కూడా చేసుకోకుండా పాత బట్టలతో బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారన్నారు. ఈ రోజు దేశంలో కరోనా మహమ్మారి ఇంతగా విస్తరించడానికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసకుంటున్న అనుచిత నిర్ణయాల వల్లనేనని, సరైన సమయంలో ప్రభుత్వాలు స్పందింకపోవడంతో, ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఆసుపత్రిలో డాక్టర్ల కొరత, మందుల కొరత, ఆక్సిజన్ కొరత వలన ఎందరో అమాయక ప్రజల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నో కుటుంబాలు తమ కుటుంబ సభ్యులను కోల్పోయి అనాధలయ్యారని, కరోనాతొ మరణించిన ప్రతి ఒక్కరికి కేంద్రం 5 లక్షల రూపాయలు సహాయం అందించాలన్నారు.