కామారెడ్డి, మే 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అణగారిన వర్గాలకు మెరుగైన విద్యను అందించి విద్యా విప్లవం సృష్టించిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని జిల్లాకలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. డాక్టర్ భాగ్యరెడ్డి వర్మ 136 వ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఎస్సి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత బాలికల కోసం పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని అన్నారు. సమాజ నిర్మాణానికి అవిరళ కృషిసల్పిన మహానీయుడు భాగ్యరెడ్డి అని అట్టి మహనీయుల జీవిత చరిత్రను బాలబాలికలకు తెలియచెప్పాలని, వారి ఆశలు, ఆశయాలకనుగుణంగా ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి రజిత, ఎస్సి కార్పొరేషన్ ఈ డి దయానంద్, గిరిజనాభివృధికారి అంబాజీ, సిపిఒ రాజారామ్, తదితరులు పాల్గొన్నారు.