ఆర్మూర్, మే 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వ్యాధి నిరోధక టీకాలు ప్రతి ఒక్క చిన్నారికి అందే విధంగా చూడాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అశోక్, డిప్యూటి డిఎం అండ్ హెచ్‌వో డాక్టర్ రమేశ్ ఆదేశించారు. బుధవారం ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ మరియు పిప్రి గ్రామాలలోని ఆరోగ్య ఉప కేంద్రాలను తనిఖీ చేశారు. అదేవిధంగా రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకాల లబ్ధిదారుల జాబితాను ముందస్తుగా తయారు చేసుకుని ప్రతి చిన్నారికి టీకాలు అందే విధంగా ఆశా కార్యకర్తలు చూడాలని ఆదేశించారు. ఎండలు అధికంగా ఉన్నందున వ్యాక్సిన్ కోల్డ్ చైల్డ్ పాటించాలని సూచించారు. అలాగే జిల్లా ఆరోగ్య ఉప వైద్యాధికారి డాక్టర్ రమేష్ ఉన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో కాల్పులు అధికంగా అయ్యేవిధంగా చూడాలని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించాలని ఆదేశించారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇప్పటి నుండే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ యూనిట్ అధికారి సాయి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గర్భిణి స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.