కామారెడ్డి, మే 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం సదాశివ నగర్ మండలంలోని సదాశివ నగర్ గ్రామపంచాయతీ, తిర్మన్‌పల్లి గ్రామపంచాయతీలను సందర్శించి పల్లె ప్రకృతి వనం, క్రిమిటోరియం, కంపోస్ట్ షెడ్, నర్సరీ, మినీ బిపిపివి మరియు అమ్మ ఆదర్శ పాఠశాల యొక్క పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ కుమార్, డిఎల్పివో శ్రీనివాస్, ఎంపీవో సురేందర్ రెడ్డి, ఏఇ పిఆర్ మారుతీ, ఎంఇవో యోసఫ్, ఏపీఎం రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు మాధవిలత, నరేష్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.