నిజామాబాద్, మే 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విశ్వహిందూపరిషత్లోని యువతి విభాగం దుర్గావాహిని ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రశిక్షణ వర్గకు దుర్గావాహిని జిల్లా సంయోజక నాంచారి రaాన్సీ రాణి ఆధ్వర్యంలో ఇందూరు నుండి 26 మంది యువతులు బయలుదేరి వెళ్లారు.
పాలమూరులో జరగనున్న ఈ వర్గలో రాష్ట్ర నలుమూలల నుంచి యువతులు పాల్గొననున్నారు. ఈ శిక్షణ వర్గలో యువతులకు కర్ర సాము, కరాటే, ఆత్మరక్షణ మరియు శౌర్య ప్రశిక్షణను ఇవ్వడం జరుగుతుందని దుర్గా వాహిని జిల్లా సంయోజక నాంచారి రaాన్సీరాణి తెలిపారు.
ప్రశిక్షణ వర్గకు బయలుదేరుతున్న దుర్గలకు విశ్వహిందూ పరిషత్ కార్యాలయం వద్ద సంస్థ ప్రతినిధులు కత్రాజి నరేందర్, రెబ్బ ఆనంద్, రమేష్, మురళి తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.