కామారెడ్డి, జూలై 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆక్సిడెంట్ అయిన శమయ్య అనే రోగికి హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉందని కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్లో మెస్సేజ్ రాగానే కామారెడ్డికి చెందిన బిజెవైఎం పట్టణ కార్యదర్శి కర్రల్లశరణ్ కుమార్ అనే యువకుడు స్వచ్చందంగా 100 కిలోమీటర్లు స్వంత ఖర్చులతో బస్ లో వెళ్లి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు.
శరణ్ సేవ దృక్పథానికి కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్, బోనగిరి శివకుమార్, రామకృష్ణ అభినందించారు.