ప్రపంచ శాంతికి ఆధారం హిందుత్వ జీవన విధానం మాత్రమే

నిజామాబాద్‌, మే 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రపంచంలో ఎన్నో దేశాల మధ్యన ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రపంచమంతా అశాంతితో రగిలిపోతున్న ఈ సమయంలో ప్రపంచ దేశాల మధ్యన శాంతిని నెలకొల్పే ఏకైక జీవన విధానం హిందుత్వం మాత్రమే అని, ఈ భూమి మీద హిందుత్వం ఒక్కటే శాంతిని ప్రేరేపిస్తుందని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్‌ అప్పాల ప్రసాద్‌ అన్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ కంటేశ్వర్‌ ప్రాంతంలో జరిగే శ్రీ నీలకంఠేశ్వర ఉద్యోగి ప్రభాత్‌ శాఖ యొక్క వార్షికోత్సవానికి ప్రధాన వక్తగా హాజరైన ప్రసాద్‌ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ 99 సంవత్సరాల తన సుదీర్ఘ ప్రయాణంలో ఈ దేశంలో నెలకొన్న ఎన్నో సమస్యలకు సమాధానం చెప్పిందని, శతాబ్దాలుగా ఈ దేశాన్ని పట్టిపీడిస్తున్న అనైక్యత మరియు అశాంతి వంటి సమస్యలకు శాశ్వతమైన సమాధానాన్ని ఇచ్చిందని రానున్న శతాబ్దంలో ప్రపంచం మొత్తానికి శాంతిని సౌబ్రాత్రుత్వాన్ని ఇవ్వగలిగే ఏకైక దేశం భారత దేశమేనని, విశ్వ గురు పీఠం మీద తప్పకుండా భారత దేశం నిలబడుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

శాఖ అంటే కేవలం ఆటపాటలు ఆడుకునే కేంద్రం కాదని సమాజ హితం కోసం తమ సర్వస్వాన్ని ధారపోసే వ్యక్తులను తయారు చేసే పరిశ్రమ అని అందుకే సంఘ సిద్ధాంతంలో శాఖకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని ఆయన అన్నారు జీవితంలో స్థిరపడిన వ్యక్తులు సమాజం పట్ల బాధ్యతను స్వీకరించాలని సమాజంలో జరుగుతున్న మతమార్పిడులు లవ్‌ జిహాద్‌ మరియు సామాజిక సమానతలను అడ్డుకొని సమ సమాజ నిర్మాణం కోసం విశేషంగా సమయం కేటాయించాలని ఆయన సూచించారు.

ప్రతి హిందువు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాలని ఈ సంస్థలో చేరడం ద్వారా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సంస్కారాలు అలవాడతాయని అదేవిధంగా దేశభక్తి ధర్మ నిష్ట వంటి ఎన్నో సద్గుణాలు మనకి అందుతాయని అటువంటి నిరంతర సాధనను కొనసాగించడం కోసం శాఖకు రావాలని రాబోయే శతాబ్ది సంవత్సరంలో ప్రతి గడపగడపకు సంఘాన్ని చేర్చాలని తద్వారా హిందూ రాష్ట్ర నిర్మాణం కోసం అందరం జాగృతం కావాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశ్రాంత ఇంజనీర్‌ విద్యాసాగర్‌ మాట్లాడుతూ ఒక గొప్ప దేశభక్త సంస్థ యొక్క కార్యక్రమానికి తనను ఆహ్వానించడం ఎంతో గర్వంగా ఉందని ఈ దేశం యొక్క ప్రతి విజయం వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ యొక్క పాత్ర ఉందని అటువంటి గొప్ప సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో తాను భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.

వార్షికోత్సవంలో స్వయం సేవకులు చేసిన శారీరక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి

కార్యక్రమంలో నగర సంఘచాలక్‌ శ్రీనివాస్‌ నగర కార్యవాహ అర్గుల సత్యం, సహకార్యవాహ సుమిత్‌, సీనియర్‌ కార్యకర్తలు, స్వయం సేవకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »