కామారెడ్డి, మే 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన కామారెడ్డి, ఎలారెడ్డి, జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్‌లకు సంబందించిన గదులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం పరిశిలించారు. సిసి కెమెరా నిఘాలో, మూడంచెల భద్రత మధ్య సెగ్మెంట్ వారీగా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో సీల్ వేసి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
ఇట్టి స్ట్రాంగ్ రూంలను సీఆర్పీఎఫ్, పొలిసు సిబ్బంది 24 గంటలు పర్యవేక్షణ చేస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని కామారెడ్డి, యెల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లకు సంబంధించి జూన్ 4 న గీతం యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం విదితమే.
ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు సంసిద్ధతకు చేస్తున్న ఏర్పాట్లు, తీసుకుంటున్న ముందస్తు చర్యలపై న్యూఢల్లీి నుండి కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, పొలిసు కమీషనర్లు, ఎస్పీ లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంగారెడ్డి నుండి ఆ జిల్లా కలెక్టర్, వల్లూరు క్రాంతితో కలిసి పాల్గొన్నారు.
అనంతరం గీతం యూనివర్సిటీలో కామారెడ్డి జిల్లాకు సంబందించిన అసెంబ్లీ సెగ్మెంట్ స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ పరిశీలించి విజిటింగ్ రిజిస్టర్‌లో సంతకం చేశారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద నిరంతరం కొనసాగుతున్న భద్రతాచర్యలను అక్కడ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలించారు.