డిచ్‌పల్లి, మే 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
దోస్త్ ఆన్లైన్ డిగ్రీ ప్రవేశానికి 2024- 25 సంవత్సరానికి ప్రత్యేక కేటగిరి విభాగంలో తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన అకాడమిక్ ఆడిట్ సెల్‌లో జరుగుతుందని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కేటగిరీలో ఎంపికైన విద్యార్థిని విద్యార్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.
28వ తేదీ మంగళవారం రోజున పిహెచ్‌సి (దివ్యాంగులకు) సర్టిఫికెట్స్ పరిశీలన జరుగుతుందన్నారు.
29వ తేదీ బుధవారం రోజున ఎన్‌సిసి సర్టిఫికెట్స్ పరిశీలన జరుగుతుందన్నారు.
విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని దోస్త్ సమన్వయకర్త డాక్టర్ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సందేహాలకు ఈ క్రింది నెంబర్లకు 9848904793/ 8374406322 సంప్రదించాలని సమన్వయకర్త పేర్కొన్నారు.