నిజామాబాద్, మే 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ఫీజుల దోపిడిని అరికట్టాలని అదేవిధంగా ఫీజులో నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రాథోడ్ అన్నారు.
ఈ మేరకు సోమవారం లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనుమతి లేని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో బుక్స్, యూనిఫామ్స్ అమ్మకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యాదవ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.