రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…

కామారెడ్డి, మే 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో జానమ్మ (60) రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు అత్యవసరంగా బి పాజిటివ్‌ రక్తం కావడంతో వారికి కావలసిన రక్త నిల్వలు రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో మోతే గ్రామానికి చెందిన గడ్డం రఘువీర్‌ రెడ్డి సహకారంతో కేబిఎస్‌ రక్తనిధి కేంద్రంలో సకాలంలో రక్తాన్ని అందిరించడం జరిగిందని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు.

రక్తదానానికి ముందు వచ్చిన రక్తదాత గడ్డం రఘువీర్‌ కు ఐ.వి.ఎఫ్‌ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన్‌ రాజన్నల తరఫున అభినందనలు తెలిపారు. రక్తదానం చేయాలనుకున్నవారు వారి యొక్క వివరాలను 9492874006 నెంబర్‌ కి తెలియజేయాలని అన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »