నిజామాబాద్, మే 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ నగరం జిల్లా కోర్టుకు ఈ వేసవికాలం దృశ్య వివిధ పనుల కోసం అత్యవసరంగా వచ్చే నిరుపేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు జిల్లా కోర్టు వద్ద సోమవారం మధ్యాహ్నం జిల్లా జడ్జి సునీత కుంచాల కక్షిదారులకు భోజనం అందజేసే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న దృశ్య ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరముంటే తప్ప ఎండలో బయట తిరగవద్దని ఆమె ప్రజలకు సూచించారు. జిల్లా కోర్టు లైసన్ ఆఫీసర్ ఎస్సై శ్యాం కుమార్ సౌజన్యంతో ఈ అన్నదాన సేవా నిర్వహించారు.
కార్యక్రమంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, జిల్లా న్యాయ సేవా సంస్థ పర్యవేక్షకులు పురుషోత్తం గౌడ్, న్యాయవాదులు సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.