కామారెడ్డి, మే 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గురువారం కామారెడ్డి మండలంలో పచ్చిరొట్ట పంట అయిన జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. మండలంలో గల నాలుగు రైతు వేదికలు అనగా చిన్నమల్లారెడ్డి ఇస్రోజివాడి శాబ్ధిపూర్ మరియు క్యాసంపల్లి రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు పర్మిట్స్ అందజేశారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రతి గ్రామ పరిధిలో ప్రతి రైతుకు విత్తనాలు అందే విధంగా చూసామని కామారెడ్డి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏ..డి.ఏ.) కె. అపర్ణ పేర్కొన్నారు.
మండలంలో గల రెండు (గర్గుల్ మరియు చిన్న మల్లారెడ్డి) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా జీలుగ విత్తనాలు రైతులకు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో రైతులకు ప్రతి క్లస్టర్లు పచ్చిరొట్ట పంటల ఉపయోగం మరియు సాగులో పాటించాల్సిన మేళకువల గురించి రైతులకు క్లుప్తంగా వ్యవసాయ విస్తరణ అధికారులు వివరించారు.
కార్యక్రమంలో ఏడిఏ కామారెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చిన్న మల్లారెడ్డి పరిధిలో 434 బ్యాగులు వచ్చాయన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గర్గుల్ పరిధిలో 400బ్యాగులు వచ్చాయి. అనగా మొత్తం 834 బ్యాగుల వచ్చాయి. దీనిలో 438 రైతులకు 572 బ్యా గులు జీలుగు విత్తనం పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఈ యొక్క విత్తనాల పంపిణీ రైతులకు ప్రశాంత వాతావరణంలో జరిగిందని ఏ రైతు కూడా ఇబ్బందికి గురి కాలేదని తెలియజేయడం అయినది. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాసరావు, చిన్నవల్లారెడ్డి క్లస్టర్ ఏ.ఇ.వో. అశోక్ రెడ్డి, ఇస్రోజివాడి క్లస్టర్ ఏ.ఇ.వో. రాణి, శాబ్ధిపూర్ క్లస్టర్ ఏ.ఇ.వో. బాలకిషన్, క్యాసం పల్లి (కామారెడ్డి) క్లస్టర్ ఏ.ఇవో. తేజస్విని, ఆయా గ్రామ రైతులు పాల్గొన్నారు.